
విల్లివాకం న్యూస్: చెన్నై అన్ననూర్ కి చెందిన
పసుమర్తి రవీంద్రబాబు, సుప్రియ దంపతుల ప్రథమ కుమారుడు పి.అస్విన్ రితేష్, ఏడవ తరగతి సెంట్ మేరీస్ పాఠశాల, అత్తిపట్టులో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ విద్యార్థి గత సంవత్సరం 1డిసెంబర్, 2024న కీబోర్డ్ ద్వారా గంటలో 1,046 వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఏప్రిల్ 14న హైదరాబాదులో జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో జోషువా బేతేల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు పాస్టర్ ఆగస్టీన్ దండింగి చేతుల మీదుగా గిన్నిస్ మెడల్, ధ్రువపత్రాన్ని అందుకున్నారు.