టీ నగర్ న్యూస్ :కాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) జరిగింది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్‌లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్ లోడ్ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది.కివూ సరస్సు (Kivu lake) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు (Rescue teams) కాపాడాయి.
ఈ పడవ ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిలో కొందరు ఈదుతూ ఒడ్డుకు రాగా, కొందరిని రక్షణ దళాలు కాపాడాయని దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్ జాక్వెస్ పురుషి మీడియాకు తెలిపారు. అయితే మరణాలకు సంబంధించి కచ్చితమైన సంఖ్య తెలియడానికి మరో రెండు రోజులు పడుతుందన్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని, గల్లంతైన 78 మందిలో అందరి మృతదేహాలు లభ్యం కాలేదని అన్నారు.
One Response
అయ్యో…