పారాసిటమాల్ వాడుతున్నారా.. అరచేతుల్లో మీ ప్రాణాలు!

పారాసిటమాల్

       జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి. పారాసిటమాల్ ట్యాబ్లెటే కదా. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఆ మెడిసిన్ వేసుకోవడానికే భయపడతారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. అందులో పారాసెటమాల్‌ సహా 50 రకాల మెడిసన్లు నాణ్యంగా లేవని తేలింది. CDSCO అనేది ఔషధాల భద్రత, సమర్థత, నాణ్యతను నిర్ధారించే అగ్రశ్రేణి ఔషధ నియంత్రణ సంస్థ. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చిన వెంటనే పారాసిటమాల్ వేసుకుంటాం. అయితే సీడీఎస్‌సీఓ రెగ్యులేటరీ అధికారులు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పారసిటమాల్ లేదని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

         పారాసెటమాల్‌తో సహా 50 రకాల మెడిసన్లు.. వైద్యులు సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవని పరిశోధనలో వెల్లడైంది. అంటే మందులు ఉద్దేశించిన విధంగా పని చేయకపోవచ్చు లేదా రోగులకు హాని కలిగించవచ్చు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణులు.. వాఘోడియా (గుజరాత్), సోలన్ (హిమాచల్ ప్రదేశ్), జైపుర్ (రాజస్థాన్), హరిద్వార్ (ఉత్తరాఖండ్), అంబాలా, ఇండోర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్ శాంపిల్స్ తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన ఫార్మాస్యూటికల్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ నాణ్యతలో రాజీపడకూడదని స్పష్టం చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి