Search
Close this search box.

టీటీడీ బోర్డు ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం, కొత్త సభ్యులు వీళ్లే

అమరావతి న్యూస్ :టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ నాయుడు ను చైర్మన్ గా నియమించారు. టీటీడీ సభ్యులుగా తెలంగాణ నుంచి ఐదుగురు,కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచిఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు

టీటీడీ సభ్యులు వీరే

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు, సభ్యులుగా పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి,ఆర్ఎన్, దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్,శాంతారాం, పి. రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకిదేవి, బి.మహేందర్ రెడ్డి, ఎం. రంగశ్రీ,బి. ఆనందసాయి, ఎల్ల.సుచిత్ర, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరబ్ హెచ్.బోరలను నియమించారు.
తెలంగాణ నుంచి నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్లకు చోటు కల్పించారు. కర్ణాటక నుంచి నరేష్ కుమార్, దర్శన్ ఆర్ఎన్, జస్టిస్ హెచ్ ఎల్ దత్, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, డాక్టర్ అదిత్ దేశాయ్ గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి సౌరభ్ హెచ్ బోరాలకు అవకాశం దక్కింది.

బీఆర్ నాయుడు ప్రస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72) నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలన్న తపనతో కృషి చేసేవారు. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చాలా చురుకుగా పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు.

బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు.బీహెచ్ఇఎల్ లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని బలంగా కోరుకున్నారు. ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించేందుకు జరిగిన ప్రయత్నాలను బీఆర్ నాయుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎంగా ఎన్టీఆర్ కొనసాగాలని కోరుతూ “ప్రజాస్వామ్య పునరుద్ధరణ” పేరున జరిగిన భారీ సభలు, ర్యాలీలు నిర్వహించిన సమయంలోనే బి.ఆర్ నాయుడు శక్తి వంచన లేకుండా చేసిన కృషితో చంద్రబాబుకు దగ్గరయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ స్థానికంగా ప్రజా ప్రతినిధిగా కూడా పనిచేశారు.

ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచలుగా ఎదుగుతూ తర్వాత టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఓ ప్రపంచ స్థాయి నగరం రాజధాని ఉండాలనే విధానాన్ని బలంగా సమర్ధించారు. అమరావతి రాజధాని కోసం బీఆర్ నాయుడు పోరాడారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని సమర్ధించినందుకు వైసీపీ ప్రభుత్వం 70 ఏళ్ల వయసులో బీఆర్ నాయుడుపై రాజద్రోహం కేసులు పెట్టింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి