రామ్ నగర్‌లో ఆంజనేయ స్వామి మహోత్సవం

టీ నగర్ న్యూస్: చెన్నై తిరువల్లికేణిలోని శ్రీ రామదాసాంజనేయ స్వామి ఆలయం వద్ద 47వ సంవత్సర ఆంజనేయ స్వామి మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ ఏడాది 11వ తేదీ ఆదివారం నుంచి 17వ తేదీ శనివారం వరకు ఈ ఉత్సవాలు ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
12వ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక పూలాభిషేకం నిర్వహించగా, సాయంత్రం 6 గంటలకు వెండి కవచ , 1001 వడలు తో. అలంకారం జరిగింది. రాత్రి 7 గంటలకు శ్రీ సత్యప్రియ బృందం వారిచే సామగానం భక్తి గీతాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

భక్తి గీతాలు ఆలపించిన కళాకారులను  ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.  రామ్ నగర్ సంక్షేమ సంఘం పెద్దలు , ఈ కార్యక్రమంలో శ్రీ రామ భక్త భజన బృంద సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం