స్ఫూర్తిప్రదాత ఆలపాటి రామచంద్ర రావు : తంగుటూరి రామకృష్ణ

విల్లివాకం న్యూస్: వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన స్ఫూర్తిప్రదాత అంబికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత దివంగత ఆలపాటి రామచంద్రరావు అని ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ కొనియాడారు. దివంగత ఆలపాటి రామచంద్రరావు100వ జయంతిని పురస్కరించుకుని చెన్నై వడపళనిలోగల అంబికా ఎంపైర్ హోటల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలపాటి రామచంద్ర రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో అంబికా ఎంపైర్ హోటల్ జనరల్ మేనేజర్ ఆర్.కాలాతినాథన్, అడ్మిన్ మేనేజర్ ఆర్ కె పుష్పలత, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, అపోలో హాస్పిటల్ మార్కెటింగ్ కు చెందిన రతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలాతీనాథన్ మాట్లాడుతూ ఆలపాటి రామచంద్రారావు శత జయంతి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన కఠోర శ్రమతో కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆరంభంలో అగర్బత్తి డివిజన్ తో ప్రారంభించిన వ్యాపారం హోటల్ డివిజన్, సినిమా, రియల్ ఎస్టేట్, విండ్ మిల్ రంగాలకు వ్యాపించినట్లు తెలిపారు. తమ హోటల్స్ చెన్నై, సేలం, విశాఖపట్నం, ఏలూరులలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు తమ కంపెనీ చైర్మన్ అంబికా కృష్ణ కృషి ఎంతో ఉందన్నారు. తమ హోటల్స్ లో అతిథులకు నాణ్యమైన సేవలు అందిస్తామన్నట్టు తెలిపారు. శత జయంతి సందర్భంగా హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ అంబికా హోటల్స్ తో ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ ఒప్పందం చేసుకుని ఉందన్నారు. అంబికా కృష్ణ తమ సంస్థలో గ్లోబల్ లీడర్ గా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెడికల్ క్యాంపులో బ్లడ్, షుగర్ పరీక్షలతో పాటు డెంటల్, జనరల్ చెకప్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించటంపై నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి