నటి కస్తూరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ద్రావిడదేశం కృష్ణారావు

టి నగర్ న్యూస్ :ఇటీవల ఒక సభలో సినీనటి కస్తూరి ప్రసంగిస్తూ తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారికి చరిత్ర లేదనియు 300 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రానికి కేవలం రాజులకు సేవ చేయటానికి మాత్రమే తెలుగువారు వచ్చారని అంతమాత్రాన వారిని తమిళనాడులోని స్థిరపడిన తమిళ వారితో సమానంగా పరిగణించలేమని తెలుగువారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం స్టాలిన్ మంత్రివర్గంలో తెలుగువారికి ఐదు మంత్రి పదవులు ఇచ్చారని కూడా తన అక్కసును వెళ్లబోశారు. కేవలం మొఖానికి రంగులు వేసుకొని నాలుగు డబ్బుల కోసం డాన్సులు వేసినంత మాత్రాన తాను మహానటి కాబోదని తన స్థాయిని మించి వ్యాఖ్యలు చేసిన కస్తూరిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అదేవిధంగా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ద్రావిడ దేశం అధ్యక్షులు వి .కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈమధ్య తమిళనాడు రాష్ట్రంలో సీమాన్ లాంటి రాజకీయవేత్తలు కూడా తెలుగువారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇకమీదట ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని తెలుగువారిని ఐక్యపరిచి బలనిరూపణకు, అదేవిధంగా రాజకీయంగా తమ సత్తా ఏంటో చూపిస్తామని కృష్ణారావు తెలియజేశారు. గత చరిత్ర ఏంటో తెలుగు వారి ఘన చరిత్ర ఏంటో తెలియని అజ్ఞాని కస్తూరి ఒక చరిత్రహీనురాలని కృష్ణారావు అన్నారు. ఒకప్పుడు చెన్నై నగరంలో 90 శాతం తెలుగువారేనని చెన్నై నగరాభివృద్ధికి స్థలం కూడా ఇచ్చింది చెన్నయ్య అనే తెలుగు వాడేనని చెన్నపట్టణాన్ని చెన్నై నగరంగా మార్చేసినంత మాత్రాన చరిత్రనెవరూ చేరపలేరని అన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారికి తప్పుడు నివేదికలు అందించి చెన్నై మహా నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కు రాకుండా అడ్డుకున్న విషయo కూడా బహిరంగ రహస్యమేనని ఆయన అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో తెలుగువారికి ఐదు మంత్రి పదవులు ఇచ్చారని కూడా కస్తూరి హేళన చేయటాన్ని కూడా ఖండిస్తూ ఇప్పటికీ తమిళనాడులో రెండు కోట్ల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారని లెక్కల ప్రకారం చూసుకుంటే తెలుగువారికి ఇంకా మంత్రి పదవులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో క్రిష్ణగిరి ,ధర్మపురి, కోయంబత్తూర్, మధురై, విరుదునగర్ , తిరుచ్చి తిరుత్తణి , తిరువళ్లూర్, గుమ్మిడిపూండి, పొన్నేరి తదితర ప్రాంతాలతో పాటు చెన్నై నగరంలో ఇప్పటికీ తెలుగు వారే అధికంగా నివసిస్తున్నారని తెలుగువారికి రావాల్సిన వాటా కోసం, తెలుగు విద్యార్థుల సమస్యల కోసం ద్రావిడదేశం తరఫున తెలుగు సంఘాలతో వెంటనే కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కృష్ణారావు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి పౌరుడికి రాజ్యాధికారం దక్కాలని డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన విధంగా విసీకే పార్టీ అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు తిరుమావళవన్ గారు ఒక సభలో చెప్పిన విధంగా ప్రభుత్వంలోనూ అధికారంలోనూ భాగస్వామ్యం కావాలని కోరడం సమంజసమేనని వారి కోరికను ద్రావిడ దేశం స్వాగతిస్తుందని ఈ సందర్భంగా కృష్ణారావు తెలియజేశారు

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి