
చెన్నై న్యూస్: తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి శనివారం అరెస్టయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో చెన్నై పోలీసులు కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిని కోర్టు కొట్టి వేసింది దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా హైదరాబాదులో ఉన్నట్లు ఆచూకీ లభ్యమైనది దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను చెన్నైకు తరలించారు.ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి శంకర్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆమె చిక్కుల్లో పడ్డారు.
తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వారిని ఉద్దేశించి ఎప్పుడో దశాబ్దాల క్రితం రాణుల దగ్గర సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడు చలామణి అవుతూ.. మాట్లాడుతున్నారని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి.
తమిళనాడులో ఉన్న తెలుగు వారు అంతఃపురంలో ఊడిగం చేసుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారా తెలుగువారు అంటే ఎంత చిన్నచూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం అజ్ఞాతంలో ఉన్న కస్తూరి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.
తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి అరెస్ట్ కావడం, కృషిచేసిన తెలుగు వారందరికీ, ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి, వివిధ రాజకీయ పార్టీల అధినేతలకు, ముఖ్యముగా ద్రావిడ దేశం కృష్ణారావుకు తెలుగు ప్రజలందరి తరపున, తెలుగు ప్రముఖుడు లయన్ జి మురళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలంతా ఐక్యతతో ఉండి ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. టీ నగర్ న్యూస్.
…………..