
విళ్లివాకం న్యూస్: చెన్నై కొరటూరు అగ్రహారం అన్నయ్ అవెన్యూలోని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద పండుగ సంక్రాంతిని పల్లె వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 9:00 గంటలకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాములు హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు శాస్త్రక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. గంగిరెద్దు విన్యాసాలు అలరించాయి. కొత్త మట్టి గుండెలలో పొంగలిని స్వామివారికి నైవేద్యంగా నివేదించారు. అలాగే లోక కళ్యాణార్థం పూజలు నిర్వహించారు. వంటలు ముగ్గుల పోటీలలో విజేతలను అభినందిస్తూ స్రవంతి అధ్యక్షులు జేయం నాయుడు, కార్యదర్శి జే శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ విన్ హరినాథ్, సిహెచ్ సాంబశివరావు, ఈ బాలాజీ, కమిటీ కార్యవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు. శ్రీ సంస్కృతి వేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ ఉప్పులూరి విజయలక్ష్మి పర్యవేక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.