Search
Close this search box.

టీ20 సారథిగా శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంపికయ్యే అవకాశం??

భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియమితులయ్యారు. రాహుల్‌ ద్రవిడ్‌ కాంట్రాక్ట్‌ ముగియడంతో గౌతమ్‌ గంభీర్‌ను టీమిండియా కోచ్‌గా బీసీసీఐ నియమించింది. గంభీర్‌ కోచ్‌ అయిన తర్వాత ఇప్పుడు చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. టీ20లో తదుపరి కెప్టెన్‌ ఎవరన్నదే అతిపెద్ద సవాలుగా మారింది. టీ20 ఇంటర్నేషనల్‌ నుంచి రోహిత్‌ శర్మ రిటైరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడి స్థానంలో మరో ఆటగాడిని కెప్టెన్‌గా నియమించాల్సి వస్తుంది. రోహిత్‌ శర్మ తర్వాత హార్దిక్‌ పాండ్యా టీ20 కెప్టెన్‌ రేసులో ముందంజలో ఉన్నాడు. అతను టీ20 ప్రపంచ కప్‌ 2024 కోసం జట్టుకు వైస్‌-కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. అందుకే హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీకి బలమైన పోటీదారుగా ఉండే అవకాశం ఉంది. అయితే, హార్దిక్‌ మాత్రమే కాకుండా చాలా మంది ఇతర పోటీదారులు ఉన్నారు. ఈ జాబితాలో రిషబ్‌ పంత్‌, శుభమన్‌ గిల్‌ కూడా ఉన్నారు. ఇక శుభ్‌మన్‌ గిల్‌ గురించి మాట్లాడితే, అతను జింబాబ్వే పర్యటనకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అందుకే అతను కూడా ఎంపిక కావొచ్చు. అయితే, హార్దిక్‌ పాండ్యా మాత్రమే భారత టీ20 జట్టు తదుపరి కెప్టెన్‌గా మారగలడు. దీనికి కారణం తన కెప్టెన్సీలో గుజరాత్‌ టైటాన్స్‌ను ఐపీఎల్‌ ఛాంపియన్‌గా చేసి రెండోసారి ఫైనల్స్‌కు తీసుకెళ్లడమే. గతంలో కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కారణంగా గౌతమ్‌ గంభీర్‌ కోచింగ్‌లో కెప్టెన్సీలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. టీ20 జట్టుకు హార్దిక్‌ పాండ్యా తదుపరి కెప్టెన్‌గా మారవచ్చు. అయితే, గౌతమ్‌ గంభీర్‌ సంచలన నిర్ణయం తీసుకుంటే, టీ20 సారథిగా కోల్‌కతా నైట్‌ రౌడర్స్‌కు ట్రోఫీ అందించిన శ్రేయాస్‌ అయ్యర్‌ లిస్టులో చేరే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, గౌతమ్‌ గంభీర్‌ భారీ రిస్క్‌ తీసుకున్నట్లేనని అనిపిస్తుంది. గత కొంతకాలంగా శ్రేయాస్‌ అయ్యర్‌ అంతగా ఫాంలో లేడు. ఇలాంటి సమయంలో రిస్క్‌ తీసుకున్నట్లేనని తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి