Search
Close this search box.

మరోసారి పతాకధారిగా పీవీ సింధు!

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరోసారి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనున్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలుగమ్మాయి సింధు.. పారిస్‌ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను సింధు గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల తరఫున టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ శరత్‌ కమల్‌ పతాకధారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాదీ మాజీ షూటర్‌, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా వ్యవహరించనున్నారు. చెఫ్‌ డి మిషన్‌గా బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ ఎంపిక కాగా.. ఆమె వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో గగన్‌కు అవకాశం వచ్చింది. ‘మేరీ కోమ్‌ స్థానంలో ఒలింపిక్‌ పతకం గెలిచిన యువ అథ్లెట్‌ కోసం చూస్తుండగా.. గగన్‌ పేరును మా సహచరులు సూచించారు. మేరీకి గగన్‌ సరైన ప్రత్యామ్నాయం. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక మహిళా అథ్లెట్‌ సింధు, దిగ్గజ టీటీ ప్లేయర్‌ శరత్‌ కమల్‌ పారిస్‌లో పతాకధారులుగా వ్యవహరిస్తారు’అని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి