Search
Close this search box.

హార్దిక్‌, నటాషా విడాకులకే సిద్ధమయ్యారు

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌ మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. నివేదికల ప్రకారం, హార్దిక్‌, నటాషాల మధ్య విభేదాలు వీడటం లేదని, ఇద్దరూ సరిదిద్దుకోవడంలో లేదంటూ, వీరిద్దరి కామన్‌ ఫ్రెండ్‌ ఈ కీలక విషయాన్ని బయటపెట్టాడు. గత కొన్ని రోజులుగా హార్దిక్‌, నటాషా మధ్య విడాకుల పుకార్లు తెగ వినిపిస్తున్నాయి. ఇటీవల హార్దిక్‌ పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించినప్పుడు, నటాషా స్టాంకోవిచ్‌ దానిపై స్పందించలేదు. ఆమె సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ను పంచుకోలేదు లేదా టి 20 ప్రపంచ కప్‌ కోసం వెస్టిండీస్‌ లేదా యుఎస్‌ఎకు ఆమె వెళ్లలేదు. ప్రపంచ కప్‌ ట్రోఫీని గెలిచిన తర్వాత హార్దిక్‌ పాండ్యా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా, నటాషాతో అతని ఫొటో కనిపించలేదు. హార్దిక్‌ తన కొడుకుతో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. కానీ, అతని భార్యతో ఒక్క వీడియో లేదా ఫొటో కూడా కనిపించలేదు. అనంత్‌ అంబానీ వివాహ వేడుకకు హార్దిక్‌ పాండ్యా ఒంటరిగా వెళ్లాడు. ‘హార్దిక్‌, నటాషాలు ఒకరినొకరు అర్థం చేసుకునే మూడ్‌లో లేరు’ దీంతో హార్దిక్‌, నటాషా మధ్య బాగా లేదని అభిమానులు భావిస్తున్నారు. టైమ్స్‌ నౌ ప్రకారం, హార్దిక్‌, నటాషా ప్యాచ్‌ అప్‌ మూడ్‌లో లేరని, బ్రేక్‌ అప్‌కే వారు సిద్ధంగా ఉన్నట్లు వారిద్దరి సన్నిహితుడు చెప్పాడు. నివేదికల ప్రకారం, హార్దిక్‌ చేసిన కొన్ని తప్పులకు నటాషా కోపంగా ఉందంట. వాటిని సరిదిద్దుకోవడానికి హార్దిక్‌ ఇష్టపడడం లేదంట. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదంటూ వాళ్ల ఫ్రెండ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ పాండ్యా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో, అతను %ూణI% ప్రపంచ కప్‌లో గాయపడటం నుంచి %Iూూ% లో ఫ్లాప్‌ కావడం, ఆ తర్వాత బలమైన పునరాగమనం చేయడం, %ు%20 ప్రపంచ కప్‌ 2024 ట్రోఫీని గెలుచుకోవడం వరకు ఫొటోలను పంచుకున్నాడు. దీనిపై అభిమానులు చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి