తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక వెబ్సైట్, ఈ పేపర్ ఆవిష్కరణ

చెన్నై న్యూస్: అనతి కాలంలో మారిన సాంకేతిక మార్పుల్లో భాగంగా తెలుగు న్యూస్ టైమ్స్ ఆన్లైన్ పత్రిక వెబ్సైట్ మరియు ఈ పేపర్ నూతనంగా బుధవారం ఉదయం ఉగాది సందర్భంగా ఆవిష్కరించారు. చెన్నైలో గత ఐదేళ్ల క్రితం డిజిటల్ వార్తాపత్రికగా తెలుగు వారి కోసం పురుడు పోసుకుని తెలుగువారు జరుపుకునే కార్యక్రమాలను నిమిషాల వ్యవధిలో చేరవేస్తూ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నూతనంగా వెబ్సైట్ మరియు ఈ పేపర్ ను ఆధునిక సాంకేతిక మార్పులతో తీర్చిదిద్దడం జరిగింది. తెలుగు ప్రముఖుడు, సుప్రీం కోర్టు న్యాయవాది డాక్టర్ ఏ ఎన్ పురుషోత్తం, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా వారి చేతుల మీద వెబ్సైట్ మరియు ఈ పేపర్ ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక తెలుగు ప్రజలకు ఎంతో చేరువైందని మరింతగా ముందుకు వెళ్లేందుకు వెబ్సైట్ మరియు ఈ పేపర్ ఎంతో ఉపయోగపడుతుందని అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య ,పత్రిక నిర్వాహకులు సిహెచ్ ముకుందరావు, వి ఎస్ ప్రకాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

…………….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260319-WA0255
ఘనంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం 'ఉగాది స్వర్ణోత్సవ సంబరాలు'
IMG-20260319-WA0227
శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు
IMG_20260319_170816
పుళల్ కావంగరై తెలుగు ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
IMG-20260319-WA0089
పరాభవ సంవత్సరం భయమా? అసలు అర్థం ఇదే!
IMG_20260318_220750
తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక వెబ్సైట్, ఈ పేపర్ ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి