సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత జట్టు మరో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ 40 పరుగులు చేయగా, జాసన్ హోల్డర్ (37 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (34 నాటౌట్), షై హోప్ 32, షిమ్రాన్ హెట్మయెర్ 27 పరుగులతో జట్టుకు మంచి స్కోరు అందించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా మరియు వరుణ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 97 పరుగులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా (17) కీలక పరుగులు జోడించారు.
ఈ విజయంతో భారత్ సూపర్-8లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సెమీస్‌లోకి అడుగుపెట్టగా, వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
……..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి