తెలుగు విద్యార్థులకు శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ప్రతిభా పురస్కారాలు

*ఉగాది పర్వదినాన నగదు బహుమతుల ప్రదానం

చెన్నై:ఎప్పటిలాగే భావి భారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో శ్రీ ఆంధ్ర కళా స్రవంతి (చెన్నై) సంస్థ 2025 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభా పురస్కారాలను నగదు రూపంలో అందించేందుకు నిర్ణయించింది.
ఈ సందర్భంగా 2025 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన 10వ తరగతి మరియు +2 చదువుతున్న తెలుగు విద్యార్థినీ విద్యార్థులు తమ మార్కుల వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అనుమతితో కూడి, 28-02-2026 లోగా సంస్థకు పంపవలసిందిగా నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని సంస్థ విజ్ఞప్తి చేసింది. ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ప్రోత్సాహక నగదు బహుమతులను రాబోయే శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినాన ఘనంగా అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలకు క్రింది చిరునామా లేదా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.
ఇట్లు
జె.యం. నాయుడు
శ్రీ ఆంధ్ర కళా స్రవంతి, చెన్నై
చిరునామా:
శ్రీ ఆంధ్ర కళా స్రవంతి,
170/1, గణపతి స్ట్రీట్,
అన్నై అవెన్యూ,
కొరట్టూర్ అగ్రహారం,
చెన్నై – 600 076
మరిన్ని వివరాలకు:
📞 98400 66999

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం