
విళ్లివాకం న్యూస్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వామ్ బజార్ కు ఆదివారం అనూహ్య స్పందన లభించింది. దీనికి చెన్నై చూలైమేడులో గల గిల్ నగర్ ఎక్స్టెన్షన్, నెం.118, వామ్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్
వేదికయింది. ఈ సందర్భంగా వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ వైశ్య వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు, అలాగే వారి పరిచయాలు పెంచుకునేందుకు వామ్ బజార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో వివిధ రకాలైన స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ బొమ్మలు, పచ్చళ్లు, పొడులు తదితర వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బంగారం రేట్లు పెరిగినందున కియారా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో 9 కేరెట్ల ఆభరణాలు ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. ఈరోజు నుంచి రెండు రోజులపాటు వామ్ ఆధ్వర్యంలో సిల్వర్ 100 గ్రామ్స్, బిస్కెట్స్, మెటల్స్, హోల్ సేల్ ధరలకు బిల్లులతో అందజేయబడతాయని, ప్రతిరోజు లక్కీ డిప్ తీసి పాల్గొన్న విజేతలకు అందజేస్తున్నట్లు తెలిపారు.
ప్రతినెలా నాలుగవ ఆదివారం ఇలాగే ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. సిల్వర్ మెటల్స్, కాపర్ మెటల్స్, బిస్కెట్స్ రాయితీలతో అందజేస్తున్నట్లు తెలిపారు. 10 కేజీల కాపర్ వస్తువులు కొన్న వారికి దాదాపు రూ.5,000 డిస్కౌంట్ అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు. సదరన్ ట్రావెల్స్ వారి లక్కీ డిప్ కింద ఢిల్లీ, విజయవాడలలో వారి స్టార్ హోటల్స్ లో మూడు రాత్రులు, మూడు పగళ్ళు ఉచితంగా బస కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ అడ్వైజర్ రాజశేఖర్, గ్లోబల్ కో – ఆర్డినేటర్ కేకే త్రినాథ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
……………