సీఎం స్టాలిన్ సమక్షంలో వైద్య లింగం డీఎంకేలో చేరిక

చెన్నై న్యూస్: మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం ‘ఐక్య అన్నాడీఎంకే’ నినాదంతో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన బృందంలో ఉన్న మనోజ్ పాండియన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇటీవల డీఎంకేలో చేరారు. అలాగే జే.సీ.డి. ప్రభాకర్ టీవీకేతో ఏకమయ్యారు.
ఓ. పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైద్య లింగం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు వైద్య లింగం స్పీకర్ అప్పావును స్వయంగా కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
ఈ నేపథ్యంలో అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో వైద్య లింగం అధికారికంగా డీఎంకేలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం మద్దతుదారుడైన వైద్య లింగం డీఎంకేలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం