రామ్ నగర్ లో వైభవముగా ఆంజనేయస్వామి ఉత్సవములు

విల్లివాకం న్యూస్: చెన్నై, తిరువల్లికేనిలోని శ్రీరామదాసాంజనేయ స్వామి ఆలయము 47 వ సంవత్సరపు ఆంజనేయ స్వామి మహోత్సవములు వేడుకగా జరుగుతున్నవి. 16.1.2026వ తేదీ ఉదయం 6:00 గంటలకు మూలికల అభిషేకము బాగా జరిగినది. సాయంత్రం 6:00 గంటలకు పలు పండ్లతో అలంకరణ చేసి అభిషేకము చేశారు. ఇందులో చాలామంది భక్తులు హాజరయ్యారు. రాత్రి 7:00 గంటలకు సహపంక్తి భోజనము జరిగింది. కార్యక్రమానికి పుర ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం శ్రీ రామదాసాంజనేయ ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ సంక్షేమ సంఘ సభ్యులు, సీతారామాంజనేయ భజన బృందం సభ్యులు, యువకులు కలిసి జయప్రదంగా చేశారు. చివరిగా కైంకర్యము చేసిన వారిని గ్రామ సంక్షేమ సంఘం పెద్దలు, అన్ని దేవాలయ కార్యనిర్వాకులు, ఉత్సవ కమిటీ వారు గౌరవించారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం