
విల్లివాకం న్యూస్: చెన్నై తిరువల్లికేనిలోని శ్రీ రామదాస ఆంజనేయస్వామి ఆలయము వద్ద 47వ సంవత్సరపు ఆంజనేయస్వామి మహోత్సవము ఘనముగా జరుగుతున్నది. 13.1.2026వ తేదీ ఉదయం 6:00 గంటలకు గణపతి హోమము కప్పల శ్రీనివాసుల దంపతుల కైంకర్యముతో జరిగినది. సాయంత్రము 6:00 గంటలకు లక్ష్మి వివేధ సమర్పించిన శ్రీ సాయి నాట్యాలయం ఆధ్వర్యంలో ప్రదర్శించిన భరతనాట్యము అందరినీ ఆశ్చర్యపరిచినది. తర్వాత కళాకారులకు కార్యనిర్వాహకులు బహుమతులు బహుకరించి గౌరవించారు.
రాత్రి శ్రీరామభక్త భజన మందిరము తరపున రామ హనుమాన్ భక్తి గీతములు పాడి ప్రేక్షకులకు ఆకర్షితులైరి. చివరిగా వారిని కార్యనిర్వాహకులు గౌరవించారు. ఈ కార్యక్రమమునకు గ్రామ సంక్షేమ పెద్దలు, భక్తులు, స్త్రీలు, యువకులు పాల్గొనేరి. తర్వాత అందరికీప్రసాదము పంచిపెట్టబడింది.