
మంగళగిరి, జూన్ 29 : మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెనాలి శాసనసభ్యుడు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్ ప్రజా జీవితంలో మూడున్నర దశాబ్దాలపాటు ఉన్నారని, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో సేవలందించారన్నారు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. డి.శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.