
విళ్లివాకం న్యూస్: మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ 2026 ఫిబ్రవరి 25,26,27 తేదీలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు ‘మాస్టర్ శార్వరి సాహిత్యం – సమాలోచన’ అనే అంతర్జాతీయ సాహితీ సదస్సుకు సంబంధించిన వివరాలతో కూడిన బ్రోచర్ ను, శార్వరి గారు హైదరాబాదులో స్థాపించిన ‘యోగాలయ అవి వెళ్లివాకం న్యూస్ ‘ లో ఆ బ్రోచర్ ను 30.12.2025 సాయంత్రం 3.30 గంటలకు ఆవిష్కరించడమైనది. ఈ కార్యక్రమానికి పెద్దలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, విశ్వర్షి వాసిలి వసంత కుమార్, మాస్టర్ శార్వరి కుటుంబ సభ్యులు, వారి మనుమరాలు, వారి శిష్యులు, పెద్దలు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాస్టర్ శార్వరి గారితో ఉన్న అనుబంధాలను తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మాస్టర్ గారు ఎంతో గొప్ప వ్యక్తిని, వారి శిష్యులుగా ఉండటం అదృష్టం అని, వారి అభిప్రాయాలు, ఆలోచనలు, వారి సేవలు పదిమందికి ఇంకా చేరాలని, ఆ జ్ఞానం పదిమంది మేలుకోరి గురువుగారు ఆశించిన లక్ష్యాలని ప్రజలకు చేరాలని, ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారిని అభినందిస్తూ, ఈ సదస్సుకు తన సహాయ సహకారాలు కూడా అందిస్తానని తప్పనిసరిగా తాను పాల్గొంటారని గురువుగారితో గల అనుబంధాలను తెలియజేశారు. ఆ తర్వాత పెద్దలు జీవీకే మూర్తి గారు శార్వరి గారితో ఉన్న అనుబంధాలు వారితో కలిసి ఉన్న సందర్భాలు ఆ విశేషాలు ఎన్నో పంచుకొని వారి సాహిత్యం, వారి ఆలోచనలు 10 మందికి చేరితే ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని వారు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు మాస్టర్ శార్వరి గారి శిష్యవర్గం, శార్వరి గారి కుటుంబ సభ్యులు పద్మప్రియ, శార్వరి గారి మనవరాలు ప్రహాస తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ‘యోగాలయ’ గురువు విశ్వర్షి డాక్టర్ వాసిలి వసంత కుమార్ నేతృత్వంలో వారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడమైనది.
………….