ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు.

జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1990-91లో కేంద్రమంత్రిగా, 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు.

కిసాన్ పుత్రుడిగా దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఆయన, జనతాదళ్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పనిచేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి