
విల్లివాకం న్యూస్: ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలని, కేతిరెడ్డి
బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించారని కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు
రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్,
మంచులక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మందిపై కేసు
యాంకర్లు శ్రీముఖి లపైనే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లరెన్సులపై
318(4), 112 రెడ్
318(4), 112 రెడ్‌విత్, బీఎన్‌ఎస్ 3, 3(A), 4..
ఐటీ యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం టాలీవుడ్ ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి బెట్టింగ్ అప్స్ ల ప్రకటనలలో నటించి ఒక తీవ్రమైన తప్పు చేసారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తన అభ్యంతరం తెలిపారు. వార ప్రకటన లోఆన్లైన్ గ్యాంబ్లింగ్ భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఒక చట్టం ద్వారా నేసేయఁదించటం జరిగిందని, ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుతో పాటు కేంద్ర ఐ.టి శాఖ మంత్రి కి గ్యాంబ్లింగ్ కి సంబంధించిన సైట్స్ మరియు పోర్టల్ లు బ్లాక్ చేయాలని కోరడం జరిగిందని, దీనిపై సమగ్ర చట్టం పార్లమెంట్ లో చేయాలని, మిగతా ఆన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి ఆయా రాష్ట్రలలో కూడా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రద్దుకు కేంద్రాన్ని కోరాలని అప్పుడే భారత్ లో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను లేకుండా చేయగలమని, ఇప్పుడు తెలంగాణ లో ఫైల్ చేసిన కేస్ లో సెలెబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్ లపై ప్రస్తుతం పెట్టిన కేస్ లో బలం ఈడియే అని వారి పాత్ర వలన డబ్బు ఎంత చలామణి అయ్యిందో తెలుస్తోందని, భారత దేశం లో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం 30 శాతం పెరిగిందని, మహిళలు సైతం ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు బానిసలవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివిధ రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపుటకు ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడం తో పాటు కేంద్రం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ ను మరియు పోర్టల్స్ ను బ్లాక్ చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలే కానీ
ప్రజలకు నష్టం కలిగించే వ్యవహారాలు చేయడం సిగ్గు చేటని, ‘మా’ అసోసియేషన్ వెంటనే స్పందించి తగిన విధమైన చర్యలకు ఉపక్రమించాలని
యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన..
రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదన్నది వారు గుర్తెరిగి నడుచుకోవాలని కేతిరెడ్డి వారిని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి ఆన్లైన్ బెట్టింగ్ పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు