హైదరాబాద్‌లో విషాదం: ఆర్థిక కష్టాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలు భరించలేక, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు తీసుకున్నారు.

ఎం జరిగింది?

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44) కుటుంబం గత ఏడాది హబ్సీగూడకు మారింది. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసిన ఆయన, ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేశారు. దీంతో, కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది.

ఈ సమస్యలతో తీవ్రంగా బాధపడిన చంద్రశేఖర్, మొదట తన 15 ఏళ్ల కుమార్తె శ్రీత రెడ్డిని ఊరేసి చంపాడు. అనంతరం, 10 ఏళ్ల కుమారుడు విశ్వాన్ రెడ్డికి విషం ఇచ్చి హత్య చేశాడు. చివరగా, భార్య కవితతో కలిసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

పోలీసులు ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో చంద్రశేఖర్ తన మానసిక, ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ—

“నా చావుకు ఎవరూ కారణం కాదు. వేరే మార్గం లేకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మానసికంగా, శారీరకంగా, కెరీర్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు…” అని రాశారు.

ఈ ఘటన హబ్సీగూడలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి