పెళ్లి ముందురోజు అదృశ్యం… మరుసటి రోజు శవమై తేలిన యువతి!

గూడూరు: పెళ్లి ఆనందంలో మునిగిపోవాల్సిన ఓ యువతి, వివాహానికి ముందురోజే అదృశ్యమై, మరుసటి రోజు మృతదేహంగా కనిపించడం గూడూరు ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఏమైంది?

సూళ్లూరుపేట రాఘవయ్యపేటకు చెందిన లేహా నిస్సీ (19) గూడూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలో బీటెక్ (ECE) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి శ్యాముయేల్ జయకుమార్, అదే కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

వివాహానికి ముందురోజే అదృశ్యం

లేహా నిస్సీకి తన బంధువుతో వివాహం నిశ్చయమై, డిసెంబర్ 14న నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి 31న పెళ్లి జరగాల్సి ఉండగా, జనవరి 20న కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన నిస్సీ తిరిగి రాలేదు.

గూడూరు సమీపంలో మృతదేహం

పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు ఎక్కడా ఆచూకీ పొందలేకపోయారు. కానీ జనవరి 25న గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో ఆమె మృతదేహం లభ్యమైంది.

సూసైడ్ నోట్‌లో ఏముంది?

పోలీసులకు లభించిన లేఖలో, “చైతూ బావా.. నా కోసం ఏదైనా చేస్తానని అన్నావుగా.. నీకు పుట్టే బిడ్డకు నా పేరు పెట్టు.. మీ లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా హ్యాపీ.. కానీ మిమ్మల్ని వదిలి వెళుతున్నా.. సారీ” అంటూ భావోద్వేగపూరితంగా రాసింది.

పోలీసుల దర్యాప్తు

నిస్సీ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలేంటో తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల వాంగ్మూలాలు, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన గూడూరు ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి