Search
Close this search box.

రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు – విశేషాలు మరియు ఘనతలు

చెన్నై న్యూస్: బారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీ పడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కొక్క విజయం సాధించిన ఇరు జట్లు ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టును ఆడుతున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఈ సందర్భంగా భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బీసీసీఐ తమ అధికారిక X వెబ్‌సైట్‌లో ఈ ప్రకటనను విడుదల చేసింది.

అశ్విన్ కెరీర్‌లో విశేషాలు

2010లో భారత జట్టుకు అరంగేట్రం చేసిన అశ్విన్, ఇప్పటివరకు 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. మొత్తం 765 అంతర్జాతీయ వికెట్లతో క్రికెట్ చరిత్రలో అతను తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

టెస్టుల్లో 474 వికెట్లు

వన్డేల్లో 151 వికెట్లు

టీ20ల్లో 140 వికెట్లు తీసిన అశ్విన్, 5 సార్లు టెస్టుల్లో సెంచరీలు కూడా సాధించాడు.

అశ్విన్‌కి శుభాకాంక్షలు

అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులు, వివిధ పార్టీల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతని సేవలు భారత క్రికెట్‌ను కొత్త ఉన్నత శిఖరాలకు చేర్చాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో అశ్విన్ కోచ్ లేదా విశ్లేషకుడిగా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించే అవకాశమున్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి