
కోడంబాకం న్యూస్ :తమిళ దర్శక దిగ్గజం శంకర్ – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. శంకర్ కెరీర్‌లో స్ట్రైట్‌గా తెలుగులో టేకప్ చేస్తున్న తొలి మూవీ కావడంతో పాటు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ లక్నోలో టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించింది. మరి గేమ్ ఛేంజర్ టీజర్ ఎలా ఉంది? శంకర్ తన మార్క్ చూపించారా? రామ్ చరణ్ లుక్ , గెటప్ ఎలా ఉంది? ఈ వివరాల్లోకి వెళితే..
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఎన్నో ఆశలు పెట్టుకుని, మరెన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు -2 దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని ఈ స్టార్ డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యమై విమర్శలు ఎదుర్కొంటూ ఉండటంతో శంకర్ కూడా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలాఉండగా.. క్రేజీ కాంబినేషన్‌కు తోడు, భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందని ఫిలింనగర్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా. ఆంధ్రాలో రూ.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 కోట్లు, నైజాంలో రూ . 55 కోట్ల మేర వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీజర్ , ట్రైలర్ తర్వాత బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి గేమ్ ఛేంజర్ టీజర్ ఎలా ఉందో పరిశీలిస్తే .. ప్రారంభంలో కొండ ప్రాంతంలో జేసీబీలతో తవ్వకాలు జరుగుతుంటాయి, ఇంతలో జనమంతా చరణ్‌ని భుజాలపై మోస్తూ జేజేలు పలుకుతుంటారు. బేసిగ్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడని, కానీ తేడా వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు లేడు అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంది.