ఏ ఎన్ ఆర్ అవార్డు అందుకున్న చిరంజీవి… కొడుకు స్పీచ్‌కు మురిసిపోయిన తల్లి అంజనమ్మ..!

హైదరాబాద్ న్యూస్ :ఏఎన్నార్‌ జాతీయ అవార్డు (2024)ను నటుడు చిరంజీవి  అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా సెప్టెంబరు 20న నాగార్జున  ఈ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. (Celebrating 100 Years of ANR). అవార్డు ఇవ్వనున్నామని చెప్పగానే చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారని, దానికంటే పెద్ద అవార్డు లేదన్నారని నాగార్జున తెలిపారు. ఆ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి నాగార్జున ఫ్యామిలీతో పాటు చిరంజీవి ఫ్యామిలీ కూడా వచ్చింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ అవార్డుల వేడుకకు గెస్ట్‌గా వచ్చాడు.

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు ఇవ్వనున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ అవార్డును బిగ్ బి అమితాబ్, చిరంజీవికి ప్రధానం చేశాడు. కాగా.. అమితాబ్, చిరంజీవికి శాలువా కప్పి సన్మానించాడు. అంతేకాకుండా మెగాస్టార్‌ను దగ్గరకు తీసుకొని అమితాబ్ ఆలింగనం చేసుకున్నాడు.

ఇక చిరంజీవి.. అమితాబ్ బచ్చన్ పాదాలకు నమస్కరించి ఎంత ఎదిగిన ఒదిగుండాలని అనే సూత్రాన్ని గుర్తుచేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నేను రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తుందని చిరంజీవి అన్నాడు. బయటవాళ్లు తనను ఎంత పొగిడినా, తన తండ్రి మాత్రం పొగిడే వాడు కాదని.. బిడ్డల్ని పొగిడితే ఆయుక్షీణం అని ఆయన భావించేవారని చిరంజీవి తెలిపాడు. చిరంజీవి మాటలకు తల్లి అంజనమ్మ మురిసిపోయింది.
ఇక ఈ వేడుకలో నాగేశ్వరరావు మరణానికి ముందు మాట్లాడిన చివరి ఆడియోను వినిపించారు. నా కోసం మీరంతా దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు. మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తాననే నమ్మకం ఉంది. మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఇక సెలవు అని ఐసీయూలో మాట్లాడారు. ఇది విన్న చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.
…………………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి