చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

*జైలు జీవితాన్ని నేర్పించింది….

హైదరాబాద్ న్యూస్ :చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్.. సెప్టెంబర్ 19 న అరెస్ట్ అయినా జానీ మాస్టర్. 36 రోజుల పాటు చంచల్ గూడా జైల్లో ఉన్న జానీ మాస్టర్.
ఇప్పటికే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు చేసిన కమిటీ. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ గత కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసునమోదైన విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అసిస్టెంట్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో జానీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉంటున్నారు. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. మొదట అవార్డు వచ్చిన కారణంగా రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిలు జానీ మాస్టర్ కు మంజూరు చేసింది. కానీ లైంగిక ఆరోపణలకు వేసుకోవడంతో అవార్డును రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో జానీ మాస్టర్ కు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు జానీ మాస్టర్ కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్ జైలు జీవితాన్ని నేర్పించింది అని అన్నారు.

ఈనెల 24న వాదనలు
జానీ మాస్టర్ తరఫున సీనియర్ న్యాయవాది సి ప్రతాప్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదు చేసిన యువతి వయస్సుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, కొన్ని ప్రొఫైల్‌లు ఆమె మేజర్ అని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె నాలుగేళ్లకు పైగా జానీ మాస్టర్ వద్ద పనిచేశారని.. వారిద్దరు స్నేహంగా ఉండేవారని వారితో కలిసి పనిచేసిన వారు చెబుతున్నారని అన్నారు. గత ఏడాది కాలంగా జానీ మాస్టర్‌కు ఆమె దూరంగా ఉందని, బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డును ప్రకటించిన వెంటనే ఆయనపై ఆరోపణలు చేశారని.. తప్పుడు ఉద్దేశాలతో ఫిర్యాదు దాఖలయ్యిందని అన్నారు. ఆమె మైనర్ కానందున పోక్సో కేసు నమోదు చేయడం సరికాదని వాదించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఫిర్యాదుదారు మైనర్ లేదా మేజర్ అనే విషయం దర్యాప్తు పూర్తయిన తర్వాత నిర్ధారిస్తామని వాదించారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి