
చెన్నై న్యూస్ :సినీ హీరో రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో నేడు కేపి.హెచ్.బి కాలనీ ఇందు ఫార్చ్యూన్ ఫిల్డ్స్ లోని ఆయన నివాసంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ఎం.ఎం.ఆర్ క్రియేషన్స్ చైర్మన్ మంద మల్లికార్జున్ రెడ్డి తో కలిసి రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం గాయత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ తో తమకు ఎనలేని బంధం ఉందని, నవోదయం అనే సినిమా నుండి తమకు పరిచయం ఏర్పడిందని వారి కుటుంబ సభ్యులతో కూడా మంచి అనుబంధంగా ఉందని అన్నారు. చిన్న వయసులోనే గాయత్రీ కి ఇలా జరగడం ఎంతో బాధను కలిగించింది అందర్నీ నవ్వించే రాజేంద్రప్రసాద్ కుటుంబంలోనే నేడు ఈ విషాద ఘటన జరగడం ఎంతో బాధాకరమైన విషయమని ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
బైట్: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి(తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు)
………..
One Response
మంచిది సార్