ఆకట్టుకున్న ‘రంగనాథ రమాయణము – మానవీయ విలువలు

విల్లివాకం న్యూస్: రాజధాని కళాశాల తెలుగు శాఖలో ఒక రోజు జాతీయ సదస్సు బుధవారం దిగ్విజయంగా జరిగింది. ప్రారంభ సమావేశంలో పత్రి అనురాధ అతిథులకు స్వాగతం పలికిన అనంతరం ద్వీప ప్రజ్వలన,
ప్రార్థనా గీతంతో ప్రారంభమైంది.

సభాద్యక్షులు డా. ఎలిజబెత్ తాను శాఖాధ్యక్షులు అయిన తర్వాత జరిగిన మొదటి జాతీయ సదస్సు గురించి, రంగనాథ రమాయణము – మానవీయ విలువలు అన్న అంశాన్ని ఎందుకు ఎన్నుకున్నారో వివరంగా చెప్పారు. రామునిలోని గొప్ప గుణాలను చెబుతూ ఆ విలువలను గుర్తు చేశారు. డా. టిఆర్ఎస్ శర్మ విశిష్ట అతిథిగా విచ్చేసి రంగనాథ రమాయణములోని మానవ విలువలను. ప్రస్తావిస్తూ గోనబద్ధారెడ్డి వ్రాసిన ద్విపదలను గురించి మాట్లాడారు. తర్వాత గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య ఎల్ బి శంకరరావు మాట్లాడుతూ రామాయణము లోని మానవ విలువలను రామరాజ్యం గురించి, సోదర ప్రేమను వివరించారు. తర్వాత వేదవిజ్ఞాన వేదిక అధ్యక్షులు జెకె రెడ్డి రంగనాథ రామాయణములోని ద్విపదలను చక్కగా ఆలపించారు. ఇక కీలకోపన్యాసం ఇవ్వటానికి విచ్చేసిన ఆచార్య మేడిపల్లి రవికుమార్
మాట్లాడుతూ జన సామాన్యంలో ద్విపద ప్రక్రియగా రంగనాధ రామాయణం ప్రాచుర్యం పొందిందని తెలిపారు. చెట్లును పెంచినట్లే సాహిత్యాన్ని కూడా పెంచిపోషించాలని సూచించారు.
డిఆర్ బి సిసిసి కళాశాల తెలుగు శాఖ అచార్యులు మాట్లాడుతూ నేటి సమాజంలో మానవీయ విలువలను ప్రస్తావిస్తూ రంగనాధ రమాయణం మానవీయ విలువలకు ఏవిధంగా దోహదపడుతుందో తెలిపారు. మధ్యాహ్న భోజన విరామం తరువాత రంగనాథ రామాయణం మానవీయ విలువలు జాతీయ సమావేశం రెండవ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ప్రెసిడెన్సీ కళాశాల పూర్వవిద్యార్థి, విశ్రాంత అచార్యులు విజయలక్ష్మి సభాద్యక్షత వహించి రంగనాధ రామాయణం యుద్ధకాండములోని విలువలను వివరించారు. అలాగే విశ్రాంత అచార్యులు డాక్టర్ సీతమ్మ సుందర కాండము, సర్ త్యాగరాయ కళాశాల అచార్యులు డాక్టర్ మునిరత్నం కిష్కింద కాండములలో మానవీయ విలువలను ప్రస్తావిస్తూ శ్రీరాముని సత్యశీలతను వివరించారు. అనంతరం సమావేశ సమానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా
ప్రముఖ న్యాయవాది అద్దెపల్లి పురుషోత్తం, విశ్రాంత జిల్లా విద్యాధికారి గంగాధర రెడ్డి, పూర్వ అచార్యులు అనిందిత, మద్రాసు విశ్వవిద్యాలయం అచార్యులు విస్తాలి శంకర రావు పాల్గొన్నారు. అతిధులకు,కళాశాల పూర్వవిద్యార్థులను పూర్వ ఆచార్యులు, భాషావేత్త ఎల్ బి శంకరరావు చేతులు మీదుగా శాలువాతో సత్కరించారు. రాజధాని కళాశాలలో ఇలాంటి జాతీయ సదస్సులు జరపాలని, భాషాభివృద్దికి విశిష్ట కృషి చేయాలని వక్తలు ఉద్గాటించారు.
…………

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి