
విల్లివాకం న్యూస్: టి. నగర్, కేసరి మహోన్నత పాఠశాల, ప్రాంగణంలో 10,11,12, వ తరగతుల విద్యార్థిని విద్యార్థుల ప్రతిభా పాటవాలను పెంపొందించుటకు, మరియు పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని అభివృద్ధి పరుచుటకు విద్యార్థుల యందు ఆసక్తిని మెరుగుపరుచుటకు ప్రత్యేక శిక్షణ తరగతులు సజావుగా జరుగుటకు కెన్సెస్ అధినేత నర్సారెడ్డి గారు, విద్యార్థులకు ప్రతి దినము సాయంకాలం పూట అల్పాహారం అందించు కార్య క్రమము సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమములో పాఠశాల కార్య వర్గ సభ్యులు కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము మొదట పాఠశాల విద్యార్థులు ప్రార్థన గీతంతో ప్రారంభమై నది .
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య అధ్యక్షత వహించారు. కెన్సెస్ అధినేత నర్సారెడ్డిని ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య శాలువతో సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య విద్యార్థుల సుద్దేశించి ప్రసంగిస్తూ గత 13 ఏళ్లుగా నర్సారెడ్డి వ్యయ ప్రయాసలను లెక్క చేయక విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ఈ సాయంకాలం ప్రత్యేక శిక్షణ తరగతులు శిక్షగా ఉండకూడదనే ధ్యేయంతో అల్పాహారం అందిస్తున్నారు.
ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వారి ఆశయాలకు తగినట్లు విద్యార్ధులు ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నాత స్థాయికి చేరుకుని వారి ఆకాంక్షలను నెరవేర్చగలరని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా గొప్ప మనస్సు మానవత్వం మూర్తిభవించిన వ్యక్తిత్వమే నరసారెడ్డి అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో నరసారెడ్డి గారు ప్రసంగిస్తూ విద్యార్థిని విద్యార్థులకు 90 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి అక్షరాల (1,00,000) లక్ష రూపాయులు బహుకరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాలాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగము పరచుకొని చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన తెలియజేశారు. తదుపరి విద్యార్థులకు అల్పాహారం అందచేశారు. పాఠశాల కార్యవర్గ సభ్యులు కృష్ణారావుగారు, మరియు ఉపాధ్యాయ బృందము, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం గావించారు
One Response
Super