నా కూతురిలో మా అమ్మను చేసుకున్నా.. రాజేంద్ర ప్రసాద్ ఆవేదన

కోడంబాకం న్యూస్ :సీనియర్ హీరో, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్‌అరెస్ట్‌ కావడంతో నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. కన్నా కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన లను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్రప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం.. రాజేంద్ర ప్రసాద్ పరసనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్రప్రసాద్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురి గురించి మాట్లాడారు

గతంలో బేవార్స్ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఆ లో సుద్దాల అశోక్ తేజ అమ్మ పై ఒక పాట రాశారు. దాని గురించి వివరిస్తూ.. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు.. నా పదేళ్ల వయసలు మా అమ్మ గారు చనిపోయారు. నేను కూడా నా కూతురిలో అమ్మను చేసుకున్నా.. కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు.. ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఈ లో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్రప్రసాద్. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
……………………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం