Search
Close this search box.

సమ సమాజం మార్పు కోసం గాంధీ చిత్త శుద్ధి తో కృషి చేశారు… నాగుల గోపాలయ్య

చెన్నై న్యూస్: భారతదేశ పునర్నిర్మాణంలో గాంధీజీ ఎంతో చిత్తశుద్ధితో కృషి చేశారని కేసరి మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య అన్నారు. చెన్నై మైలాపూర్ లోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భావన నిర్వాహక కమిటీ భవనములో బుధవారం ఉదయం జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నిర్వాహక కమిటీ చైర్మన్ కాకుటూరి అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సభకు కె అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా సభ్యులు ఎంవి నారాయణ గుప్తా స్వాగత ఉపన్యాసం చేశారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ సభ్యులందరూ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథి నాగుల గోపాలయ్య ను కమిటీ సభ్యులు జె యం నాయుడు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి నాగుల గోపాలయ్య మాట్లాడుతూ… భారతదేశ పునర్నిర్మాణంలో గాంధీజీ పాత్ర ఎంతో కీలకమన్నారు. స్వాతంత్రోద్యమంలో అహింసాయుత పద్ధతిలో సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, తదితర అనేక రూపాలలో ఉద్యమం చేసిన ఎక్కడ ఆగ్రహించలేదన్నారు. ఆయన చూపిన సత్యం, ధర్మం, అహింస, శాంతి, సహనం, ఆశయాలను కొనసాగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనేక విషయాలను ఎంతో వివరంగా విద్యార్థులకు వివరించడం విశేషం. కార్యదర్శి, కోశాధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ… నేడు యువతరానికి మహాత్మా గాంధీ ఆశయాలు ఎంతో అవసరమన్నారు. భారతదేశ అభివృద్ధిలో యువత పాత్ర పెరగాలని సూచించారు. గాంధీజీ సిద్ధాంతాలను వివరించారు. చైర్మన్ కే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సేవలు జాతి మరువలేదని, మనదేశంలో కరెన్సీ నోట్లు ఉన్నంతవరకు ఆయన సజీవంగా ఉంటారని చెప్పారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్మాణం అభివృద్ధికి తమ వంతు కృషి చేయనున్నమని చెప్పారు. అనంతరం మహాత్మా గాంధీ జయంతి నీ పురస్కరించుకొని నిర్వహించిన భారత దేశ పునర్నిర్మాణంలో గాంధీజీ పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ విస్తాలిశంకరరావు, డాక్టర్ ఏవి శివకుమారి, కుమారి హంసినీ ప్రార్థన గీతం ఆలపించగా, సభ ప్రారంభమైంది. అనంతరం ప్రముఖ గాయకులు ఎం ఆర్ సుబ్రహ్మణ్యం , అరుణ శ్రీనాథ్, దేశభక్తి గీతాలను తన బృందంతో ఆలపించారు. సభను అలాగే అలరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుడిమెట్ల చెన్నయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


…………….

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి