Search
Close this search box.

ఆ ముగ్గురి సేవలు ఎనలేనివి! – సంస్మరణ సభలో వక్తలు

విల్లివాకం న్యూస్: మాస్ సంస్థ ద్వారా ఆది ఆంధ్ర, అరుంధతీయ విద్యార్థులకు స్వర్గీయులైన
ఓలేరి జగ్గయ్య, కే వెంకటేశ్వర్లు, గుర్రం మర్రయ్య లు చేసిన సేవలు ఎనలేనివని సంస్మరణ సభలో వక్తలు కొనియాడారు.
మద్రాసు ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం (మాస్)-చెన్నై ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇటీవల పరమపదించిన ఓలేరి జగ్గయ్య, కే వెంకటేశ్వర్లు, గుర్రం మర్రయ్యలకు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. దీనికి చెన్నై ఎగ్మూర్ లోని జీవనజ్యోతి, ఐసిఎస్ఏ సెంటర్ వేదికయింది. ఇందులో మాస్ సంస్థకు విశేష సేవలందించిన ఓలేరి జగ్గయ్య, కే వెంకటేశ్వర్లు, గుర్రం మర్రయ్య చిత్రపటాల వద్ద అతిధులతో కలసి మాస్ కార్యవర్గం ఘనంగా నివాళులర్పించింది. మాస్ సంస్థ సలహాదారులు ఎ. జైసన్, గుడిమెట్ల చెన్నయ్య ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

ఇందులో మాస్ అధ్యక్షులు డాక్టర్ కొల్లి రాజు అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి, ఆత్మకూరు అజరత్తయ్య కార్యదర్శి నివేదిక చదివి వినిపించారు. కోశాధికారి వీరయ్య పాల్గొన్నారు. ముందుగా గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ సంస్థకు విశేష కృషి చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. డాక్టర్ కొల్లి రాజు మాట్లాడుతూ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ ఆశయాల మేరకు సంస్థ పనిచేస్తున్నట్లు, త్రిమూర్తులుగా సేవలందించిన వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఎవరైనా ముందుకు రావాలని అన్నారు. ఆత్మకూరి అజరత్తయ్య మాట్లాడుతూ జగ్గయ్య, వెంకటేశ్వర్లు, మర్రయ్య సంస్థకు ఎనలేని సేవలందించారని, వారు లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు మరణంతో ఖాళీగాఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవికి అనిల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పదవికి చెరుకూరి నాగార్జున రావు, కె.అన్నపూర్ణ లను నియమించినట్టుకు అజరత్తయ్య ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కె.రవి చంద్రన్, యు.నాగయ్య, రాజశేఖర్ ,బెనర్జీ, పి.పాల్ కొండయ్య, ఎస్.సంగీత రావు, మాలకొండయ్య, కూనూరు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

సర్వసభ్య సమావేశం: ఈ కార్యక్రమం అనంతరం
మాస్ 2024 వార్షిక సర్వసభ్య సమావేశాన్ని అదే స్థలంలో నిర్వహించారు.అధ్యక్షులు కొల్లిరాజు అధ్యక్షత వహించారు. కోశాధికారి ఎం.వీరయ్య మాస్ యొక్క ఆడిటర్ రిపోర్ట్ , అకౌంట్స్‌తో పాటు బ్యాలెన్స్ షీట్‌లను చదివి పూర్తి వివరాలను తెలియజేశారు.
…………………..

Spread the love

2 Responses

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి