హృదయమనే కోవెలలో….!!

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

గుండెను భద్రంగా కాపాడుకోవాలి

వెల్నెస్ కోచ్ లు వెంకటరమణ.. ఉమాదేవి

రాయలసీమ న్యూస్:జీవితం బాగుండాలంటే ఆస్థి పాస్తులు.. అంతస్థులు కాదు ముఖ్యం..ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా శరీర బండిని నడిపించే ఇంజన్ అదే గుండె పదిలంగా ఉండాలి. లోకంలో బతకాలంటే డబ్బు ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలంటే గుండె బాగుండాలి.. లబ్ డబ్ అనే చప్పుడు ఉన్నంత వరకే మనం ఏచప్పుడైనా వినగలం.. అందుకే గుండె ఆవశ్యకతను గుర్తించి దాన్ని భద్రంగా కాపాడుకోవాలని మదనపల్లికి చెందిన ప్రముఖ వెల్నెస్ కోచ్ లు టి. వెంకటరమణ.. ఉమాదేవి కోరారు. సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు మాట్లాడుతూ దురలవాట్లకు దూరంగా ఉండడం, అనువైన పోషకాహారం క్రమంగా తీసుకోవడం తగిన వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తుందన్నారు. కాలం మనది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరిపడుతుందన్నారు. అద్దం చూసుకుంటే మనం మాత్రమే కన్పిస్తాం.. అదే అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోను మనమే కన్పిస్తామన్నారు. ఏ విషయమైనా తెలుసుకోవడం, వినడం, చూడడం, నేర్చుకోవడంతో పాటు దానిని అలవాటుగా మార్చుకుని ఆచరించాలన్నారు. అప్పుడే కోరుకున్నది.. ఆశించినది సాధ్యం కాగలదన్నారు. మనిషి ఆరోగ్య విషయం కూడా అంతేనన్నారు. ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకునే మనిషి తన ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా తెలుసుకోవడం లేదన్నారు. రోగం వచ్చాక ఆసుపత్రులకు పరిగెడుతున్నారన్నారు. ముందు జాగ్రత్త కు మించిన వైద్యం లేదని గుర్తించుకోవాలన్నారు. ఆసుపత్రి మెట్లు ఎక్కకుండా మందులు లేని జీవితం ప్రతి మనిషికి సాధ్యమేన న్నారు. ఇందుకు ఆరోగ్యంపై అవగాహన అవసరమన్నారు. ముఖ్యంగా శరీరానికి పౌష్టిక ఆహారం, సూక్ష్మ పోషకాలతో పాటు తగినంత నీరు, నిద్ర ఎంతో అవసరమన్నారు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం వల్ల యువతలో కూడా గుండె జబ్బులు వస్తున్నాయన్నారు.
క్రమం తప్పకుండా విటమిన్లు.. మినరల్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చెయ్యడం అనేది దినచర్యగా మారితే అది శరీరానికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందన్నారు.
శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా ఊబకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుందన్నారు. జంక్ ఫుడ్,ఆయిల్ ఫుడ్, చక్కెర,మాంసాహారం, పాల ఉత్పత్తులతో పాటు అధిక కేలరీల ఆహారాన్ని నియంత్రించుకోవాలన్నారు . నేడు జబ్బులు లేని ఇల్లు అరుదుగా మారిందన్నారు. ఈ 2024 సంవత్సరం వరల్డ్ హార్ట్ డే థీమ్ ని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారి నిర్దేశ ప్రకారం ప్రజలు వారి వారి హృదయాలను జాగ్రత్తగా చూసుకో వలసిన అవసరాన్ని ప్రజలు గుర్తుంచుకుని తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు.
……………….

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి