
ఢిల్లీ ప్రతినిధి :ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషి ఎన్నికైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ఎల్‌ఎల్‌ఏ. ఈరోజు సమావేశం జరిగింది.ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి మర్లేనా పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. అందుకు శాసనసభాపక్షం ఆమోదం తెలిపింది. ఈరోజు సాయంత్రం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.