
చెన్నై న్యూస్ :కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు.
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా.. దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది.