ఘనంగా మాస్‌ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం

విల్లివాకం న్యూస్: మద్రాస్‌ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం–చెన్నై (మాస్‌) 32వ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం–2024 ఘనంగా జరిగింది. చెన్నై పెరంబూర్‌ లోని డిఆర్‌బిసిసిసి పాఠశాల ప్రాంగణంలో మాస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లిరాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆడిషనల్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి.శ్రీధర్, ప్రత్యేక అతిథిగా అలేఖ్య లెదర్స్‌ అధినేత నర్రావుల వెంకటరమణ పాల్గొని 10వ తరగతి, ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన 60 మంది తెలుగు విద్యార్థిని విద్యార్థిలకు ప్రతిభా అవార్డుల పేరుతో సుమారు రూ.1,20,000 ప్రోత్సాహక నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు పేద విద్యార్థుల విద్యాభివృద్దికి సహాయపడుత్ను మాస్‌ సేవలను అతిథులు కొనియాడారు. ఆత్మీయ అతిధులుగా తమిళనాడు ప్రభుత్వ లా విభాగం అదనపు కార్యదర్శి జి.సి.నాగూర్, తమిళనాడు ప్రభుత్వ అసిస్టెంట్‌ లేబర్‌ కమీషనర్‌ ఓ.జానకీరామ్, టాస్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కె.ఎలిలన్, జనని కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, జెపిఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌ విజయ్‌ రావు, మాస్‌ జాయింట్‌ సెక్రటరీ కేపి రావు, మాస్‌ సభ్యులు తదితరులు పాల్గొని విద్యార్థులు కష్టపడి చదవాలని తమ విలువైన సూచనలు ఇచ్చారు. మాస్‌ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి అజరత్తయ్య స్వాగతం పలికి ఏర్పాట్లు పర్యవేక్షించారు. మాస్‌ సంస్థ ఉపాధ్యక్షుడు నూనె శ్రీనివాసులు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో మాస్‌ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనగా దాదాపు 150 మందికి పైగా భోజనాలు అందించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం