Search
Close this search box.

దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం

ఎపికి క్యూ కడుతున్న పారిశ్రామిక వేత్తలు

అధికారులతో సిఎం చంద్రబాబు సవిూక్ష

వివరాలు వెల్లడిరచిన మంత్రి భరత్‌

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే ఉత్తమ పారిశ్రామక విధానాన్ని తీసుకురానున్నామని ఏపీ పరిశ్రమశాఖ మంత్రి టిజి భరత్‌ వెల్లడిరచారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సవిూక్ష నిర్వహించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. 2014`19 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానాన్నికి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారని వివరించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేండ్లలో పరిశ్రమల ఏర్పాట్లకు ఫ్రెండ్లీ వాతావరణం కల్పించలేకపోయారని ఆరోపించారు. గతంలో పెట్టుబడులకు పారిశ్రామక వేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పారిశ్రామికి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని వెల్లడిరచారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇండస్టియ్రల్‌ పాలసీ, ఎంఎస్‌ఎంఈ , క్లస్టర్‌ పాలసీని 45 రోజుల్లో తీసుకురానున్నామని తెలిపారు. ఏపీలో సహజ సిద్ధమైన వనరులున్నాయని, వాటిని వినియోగించుకుని ముందుకు వెళ్తామని వివరించారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో భూముల ధరల తగ్గింపుపై చర్చ జరిగిందన్నారు. ప్రస్తుతం ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్‌డ్రగ్‌ పార్క్‌, కడప జిల్ల కొప్పర్తిలో క్లస్టర్లున్నాయని తెలిపారు. కొత్తగా కుప్పం, లేపాక్షి, శ్రీకాకుళం జిల్లా మొల్లపేట, ప్రకాశం జిల్లా దోనకొండలో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని వెల్లడిరచారు. సుమారు 75 వేల కోట్ల రూపాయల వ్యయం కాగల బీపీసీఎల్‌ ఇండస్టీ ఏపీకి రాబోతుందని వివరించారు. అంతకుముందు పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబునాయుడు సవిూక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై సవిూక్ష చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడడంతో భూ కేటాయింపులు జరిగిన తరువాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయన్నారు.ఇండస్టీ కోసం కేటాయించిన భూముల కబ్జాలతో పాటు..అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రం నుంచి విడిచిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడుతానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న భూముల లభ్యత.. ఏఏ ప్రాంతాలు ఇండస్టియ్రల్‌ క్లస్టర్స్‌కు అనుకూలం అనే అంశాలపై చర్చ జరిగింది. మంత్రులు టిడి భరత్‌, కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి