అధికారిక ముద్రతో కొత్త పట్టాదార్‌ పుస్తకాలు

గత పాలకుల తప్పులను సరిదిద్దేలా నిర్ణయం

మదనపల్లి తరహా ఘటనలు జరక్కుండా చర్యలు

చట్టాల దుర్వినియోగం..చర్యలపై చంద్రబాబు సమగ్ర సవిూక్ష

పట్టాదారు పాస్‌పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదన్నది ప్రజల అభిప్రాయ మన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో అహంకారం, పెత్తందారీ పోకడలు ప్రజా ప్రభుత్వంలో ఉండబోవని, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సోమవారం ఉదయం రెవెన్యూ రిజిస్టేష్రన్ల శాఖలపై చంద్రబాబు సవిూక్ష నిర్వహించారు. రెవెన్యూశాఖలో ప్రస్తుత పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. మదనపల్లె తరహా ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, గత ఐదేళ్లలో తెచ్చిన చట్టాలు, దుర్వినియోగమైన తీరును అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సవిూక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపైనా సవిూక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా.. ఉంటే ఎలాంటి కొత్త చట్టాలు తేవాలనే అంశంపైనా అధికారులను ఆరా తీశారు. మరోవైపు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు.. భూ యజమానులకిచ్చే పట్టాదారు పాస్‌ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాల ఆరోపణలపై, గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలపై సవిూక్ష నిర్వహించారు. పెరిగిన భూ వివాదాలను పరిష్కరించడంపైనా చంద్రబాబు పలు సూచనలు చేశారు. అక్రమంగా జరిగిన భూలావాదేవీలెన్ని నష్టపోయింది ఎంత?, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎన్ని ఎకరాలు వెళ్లాయి? పూర్తి డేటాతో వచ్చేవారంతో మరోసారి సవిూక్షకు రావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూసర్వే పేరుతో రాష్ట్రంలో 77లక్షల రాళ్లు పాతారని చెప్పిన అధికారులు వివరణ ఇచ్చారు.. విశాఖ, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరుల్లో అత్యధికంగా భూములపై ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై వచ్చేవారంలోగా పూర్తి డేటా కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పీలో త్వరలో కొత్తగా ల్యాండ్‌ పాస్‌బుక్‌ల పంపిణీ చేపట్టనున్నారు. పాస్‌బుక్‌లలో కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ల ముద్రణ, యజమాని వివరాలతో పాటు క్యూఆర్‌ కోడ్‌లో రూట్‌మ్యాప్‌ కూడా ఉండేలా ఎª`లాన్‌ చేస్తున్నారు. 20కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త పాస్‌బుక్‌ల 

రూపకల్పన చేయనున్నారు. కాగా.. మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. అధికారుల దర్యాప్తులో తేలిన అంశాలపై ఆరా తీశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఇద్దరు ఆర్డీఓలు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌ విధించారు. ఫైల్స్‌ దగ్దం వెనుక ఉన్న పెద్దతలకాయాలపైనా దర్యాప్తునకు ఆదేశించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి