Search
Close this search box.

బిఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం లేనట్లేనా

మళ్లీ సైలెంట్‌ అయిన చేరికల వ్యవహారం

స్థానిక ఎన్నికలతో గ్రామాలపై ఫోకస్‌ 

కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం జరుగుతుందన్న ప్రచారం వెనక్కి పోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకపోతే ఎమ్మెల్యే చేరిక ఆగిపోయిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసినట్లుగా జరగడం లేదు. ఈ విసయంలో బిఆర్‌ఎస్‌ తీసుకున్న జాగ్రత్త చర్యలు ఫలించాయా అన్న ప్రచారం కూడా సాగుతోంది. అలాకానీ పక్షంలో ఇప్పుడు చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి చర్యలు ఉండబోతాయ న్నది కూడా ముఖ్యమే. భారత రాష్ట్ర సమితి ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం సఫలం కాలేదు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చాలా మంది రేవంత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారు కానీ.. పార్టీలో చేరే విషయంలో మాత్రం ఏ విషయం చెప్పడం లేదు. రేవంత్‌ సీఎం కాబట్టి ఆయనను ధిక్కరించలేరు.. అలాగని పార్టీలో చేరిపోతామని కూడా చెప్పడం లేదు. అనివార్య పరిస్థితుల్లో కొంత మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. అలాంటి వారు పది మంది ఉన్నారు. మరో పదిహేను మందిని అయినా చేర్చుకుంటే తప్ప.. ఎల్పీ విలీనం కాదు. ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌ లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వారెవరో మాత్రం.. క్లారిటీగా లేదు. అయితే కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ ఆడిరదని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..విలీనమయ్యే స్థాయిలో కాంగ్రెస్‌లలో చేరే పరిస్థితి లేదని క్లారిటీ వచ్చేసినట్లయింది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఒకరొకరుగా పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేరారు. పదకొండో ఎమ్మెల్యే కూడా చేరబోతున్నారని ఓ సారి హడావుడి చేశారు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లోపు బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనం అవుతుందని ఆ పార్టీలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వరకూ గంభీరమైన ప్రకటనలు చేశారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి.. ముగిశాయి.. ప్రతిపక్ష నేత హోదాలో ఓ సారి కేసీఆర్‌ సభకు వచ్చి వెళ్లారు. కానీ మరో ఎమ్మెల్యే చేరిక మాత్రం జరగలేదు. వచ్చే కొద్ది నెలల్లో తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని ఓపిక పట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ పెద్దలు సర్ది చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జరుగుతున్న చర్చల గురించి బీఆర్‌ఎస్‌ పెద్దలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో ప్రభుత్వాన్ని మార్చేద్దామన్న నమ్మకం కలిగేలా పార్టీ ఎమ్మెల్యేలకు బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనం లేదా పొత్తుల గురించి ఎంతగా ప్రచారం జరిగుతున్నా మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా రెండు పార్టీల నేతలు మౌనంగా ఉంటున్నారు. అసలు అలాంటిదేవిూ లేకపోతే మరోమాట లేకుండా ఖండిరచేవారు. అలాంటి ఖండన ప్రకటనలు రాకపోవడంతో నిజంగానే చర్చలు జరుగుతున్నాయన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత.. ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇబ్బంది పడతామని జరిగే పరిణామాలను బట్టి వేచి చూడాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా చేరికలు కాంగ్రెస్‌ అనుకున్నంత జోరుగా సాగలేదు. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తాము బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఐదు నుంచి పది కోట్లకు కొంటున్నామని అంత కంటే ఎక్కువ ఖరీదు పెట్టడం లేదని .. చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి తాము పార్టీలో చేరితే.. తామేదో డబ్బులకు అమ్ముడుపోయామన్నట్లుగా ప్రచారం చేయడం ఏమిటని వారు 

అసంతృప్తికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు. రాజగోపాల్‌ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశారో కానీ.. వచ్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ లో చేరి అమ్ముడుపోయామన్న పేరు తెచ్చుకోవడం ఎందుకని సైలెంట్‌ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్‌ రాజకీయాలు ఎప్పటికప్పుడు భిన్నంగా ఉంటాయి. అలాంటి పార్టీలో చేరాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితిని కల్పిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో చేరికలు వెనక్కి పోయాయని కూడా అంటున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి