నేటినుంచి లక్షన్నర రుణాల జమ
ఆగస్ట్ పదిహేనులోగా 2లక్షల మాఫీ
సిఎం రేవంత్ ప్రకటనతో పక్కాగా కార్యాచరణ
ఆగస్టులో రుణమాఫీ పక్రియ పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు కార్యాచరణ సాగుతోంది. రూ.1.50 లక్షల్లోపు పంటరుణం ఉన్న ప్రతి రైతుకు రెండో విడతగా జులై 31 కంటే ముందే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.6,093 కోట్లు జమ చేశాం. వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నాను. తిరిగివచ్చిన వెంటనే రూ.2 లక్షల్లోపు ఉన్న రైతుల రుణాల మొత్తాన్ని మాఫీ చేస్తాం. రైతుల రుణం తీర్చుకుని వారికి కృతజ్ఞత తెలియజేస్తాం అని ప్రకటించారు. దీంతో ఈ నెలాఖరుకు లక్షన్నర లోపు రుణాలు మాఫీ కానున్నాయి. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూసిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మొదటి విడతగా లక్ష మేరకు రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుని.. దాన్ని అమలు చేసింది. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగష్టు 15 నాటికిమొత్తం రెండు లక్షల రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 18న సాయంత్రం ముఖ్యమంత్రి రుణమాఫీని విడుదలచేశారు. లక్ష వరకు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అందులో ముఖ్యమైనది రైతురుణమాఫీ. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రైతాంగానికి రెండులక్షణ రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ హావిూ ఇచ్చారు. బీఆర్‌ఎస్ హాయంలో చేయలేనిది తాము చేసి చూపిస్తామని చెప్పడమే కాదు.. చేసి చూపించారు సీఎం రేవంత్. ఇప్పటికే లక్ష రుణాలు మాఫీ చేసిన కాంగ్రెస్… రెండో విడత రుణమాఫీకి రంగం సిద్ధం చేసింది. మంగళవారం రెండో విడత రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షన్నరలోపు ఆరు లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వనికి ఏడు వేల కోట్లు అవసరం. గతంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం12 లక్షల మందికి ఆరు వేల కోట్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్దిదారులు రైతువేదికల వద్ద సంబురాలు చేసుకున్నారు. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రుణమాఫీ
నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల రుణమాఫీ పథకం వర్తిస్తుందని చెప్పారు. కేవలం కుటుంబాన్ని నిర్దారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటామని, రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణమాఫీ నగదు జమ చేయడంతో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లబ్దిదారులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి ఆహార భద్రతాకార్డు వివరాలు ప్రామాణికంగా రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. సెంబరు 12, 2023 నాటికి రైతుకు ఉన్న రుణం, లేక రెండు లక్షల వరకు ఏది తక్కువైతే దాన్ని పొందేందుకు రైతులు అర్హులు. అలాగే రెండు లక్షల మించిన రుణం ఉన్న రైతులు ఆపైన ఉన్న రుణాన్ని మొదట చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన ఉండగా, ఆ తరువాతనే రుణమాఫీ పొందే వెసులుబాటు కల్పించింది.