Search
Close this search box.

31న గవర్నర్‌గా జిష్టుదేవ్‌ వర్మ ప్రమాణం

త్రిపుర రాజవంశానికి చెందిన వ్యక్తి వర్మ

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ నియమితులైనందున ఆయన ఈ నెల 31న రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. తమిళిసై సౌందరరాజన్‌ స్థానంలో జార్ఖండగ్‌ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణను ఇన్‌చార్జి గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం రిలీవ్‌ అవుతున్నారు. రాధాకృష్ణ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. రాధాకృష్ణన్‌ సహా మొత్తం 9 రాష్టాల్రకు రాష్ట్రపతి గవర్నర్లను నియమించారు. ఇక రాధాకృష్ణ స్థానంలో జిష్ణుదేవ్‌ వర్మ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చెప్పట్టనున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాజ్‌ భవన్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు వెళ్లి రాధాకృష్ణన్‌ కు వీడ్కోలు పలికారు. కాగా.. బోనాల సందర్భంగా ప్రజలకు రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహాంకాళి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, పంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాల ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ నెల 31వతేదీ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. జిష్ణు దేవ్‌ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. త్రిపుర రాష్ట్ర పూర్వపు రాజవంశానికి చెందిన జిష్ణు దేవ్‌ వర్మ.. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. ఆయన గతంలో 2018 నుంచి 2023 వరకూ త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో జిష్ణు దేవ్‌ వర్మ సెపాహిజాలా జిల్లాలోని చరిలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జిష్ణు దేవ్‌ వర్మ రచయిత కూడా కావడం విశేషం. ఆయన ఇటీవల తన జ్ఞాపకాల పేరుతో పుస్తకం విడుదల చేశారు. అంతే కాకుండా జిష్ణు దేవ్‌ వర్మ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కూడా కావడం గమనార్హం. ఆయన సతీమణి పేరు సుధా దేవ్‌ వర్మ. కేంద్ర ప్రభుత్వం 10 రాష్టాల్రకు కొత్త గవర్నర్లను నియమించింది. ఏడుగురిని కొత్తగా నియమించగా.. ముగ్గురిని ఓ చోటి నుంచి మరో చోటుకు బదిలీ చేసింది. త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్‌ శర్మ (66) తెలంగాణ నూతన 

గవ్నరర్‌గా నియమితులయ్యారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ వర్మ 1957, ఆగస్ట్‌ 15న జన్మించారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2018 – 23 మధ్య త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. రaార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తూ తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ గవర్నర్‌గా ఉన్న రమేష్‌ బైస్‌ను తప్పించింది. ªూజస్థాన్‌ బీజేపీ సీనియర్‌ నేత ఓం ప్రకాశ్‌ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించింది. ప్రస్తుతం ఇక్కడ గవర్నర్‌గా ఉన్న లక్షణ్‌ ప్రసాద్‌ ఆచార్య అస్సాం గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఆయనకు మణిపూర్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ప్రస్తుతం మణిపూర్‌ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది. అలాగే, రాజస్థాన్‌ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్‌ హరిభావ్‌ కిషన్‌రావ్‌ బాగ్డే నియమితులయ్యారు. ఇక్కడ గవర్నర్‌గా ఉన్న సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించారు. యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ రaార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన బరేలీ నుంచి వరుసగా 1989 నుంచి వరుసగా 2019 వరకూ (2009 – 2014 వరకూ మినహాయించి) గెలుపొందుతూ వచ్చారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రస్తుత గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పదవీ కాలం పూర్తి కాగా.. అస్సాం మాజీ ఎంపీ రమెన్‌ డేకాను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించింది. కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్‌ విజయశంకర్‌ మేఘాలయ గవర్నర్‌గా నియమించింది. ఇక్కడ గవర్నర్‌గా ఉన్న ఫగు చౌహాన్‌ను తప్పించింది. అస్సాం గవర్నర్‌గా గులాబ్‌ చంద్‌ కటిరాయను పంజాబ్‌ గవర్నర్‌గా, కేంద్ర పాలిత ప్రాంతం చండీగడ్‌ అడ్మినిస్టేట్రర్‌గా నియమించింది. కాగా, ఇప్పటివరకూ ఈ బాధ్యతలు నిర్వహించిన పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. పుదుచ్చేరి లెఫ్ఠినెంట్‌ గవర్నర్‌గా కె.కైలాసనాథన్‌ నియమితులయ్యారు. ఈయన 1979వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలకూ ఆయన ప్రధాన ముఖ్య కార్యదర్శిగానూ వ్యవహరించారు. మొత్తం 11 సార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈయన పదవీ కాలాన్ని పొడిగించగా.. ఈ ఏడాది జూన్‌ 30తో పదవీకాలం పూర్‌ఖ్తెంది. తాజాగా, ఆయన్ను పుదుచ్చేరి గవర్నర్‌గా నియమించింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి