సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?

టీమిండియా

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్‌లు ముగిశాయి. సెమీ-ఫైనల్‌కు చేరుకున్న 4 జట్ల పేర్లు వెల్లడయ్యాయి. గ్రూప్ 1 నుంచి భారత్, ఆఫ్ఘానిస్తాన్ చోటు దక్కించుకున్నాయి. ఆప్ఘాన్ విజయంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు గ్రూప్‌ 2 నుంచి చోటు దక్కించుకున్నాయి. జూన్ 27న గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. అయితే, కొన్ని కారణాల వల్ల మ్యాచ్ జరగకపోయినా లేదా రద్దు చేసినా భారత అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యేక నిబంధనల కారణంగా టీమిండియా సులువుగా ఫైనల్ చేరుతుంది.

రెండో సెమీ-ఫైనల్‌లో రిజర్వ్ డే నిబంధనలు?

గయానాలో వర్షం పడే సూచన ఉంది. వాతావరణం చెడుగా ఉంటే రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా రద్దు చేయవచ్చు. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ఐసీసీ మొదటి సెమీ-ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డేని ఉంచింది. కానీ, రెండవ సెమీ-ఫైనల్‌కు కేవలం 4 గంటల 10 నిమిషాలు అంటే దాదాపు 250 నిమిషాల అదనపు సమయం ఇచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ వ్యవధిలో మ్యాచ్ జరగకపోతే, మ్యాచ్ రద్దు అవుతుంది. దీంతో టీమిండియా ప్రయోజనం పొందుతుంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి