సైనికుల త్యాగాలను దేశం మరవదు

ఉగ్రవాదులను సమూలంగా పెకిలిస్తాం

కార్గిల్‌ అమరులకు ప్రధాని మోడీ నివాళి

పాక్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు

షింకున్‌ లా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులకు శ్రీకారం

దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ ను పురస్కరించుకుని శుక్రవారం ఆయన లద్దాఖ్‌ వెళ్లారు. ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై విరుచుకు పడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. గతంలో పాకిస్థాన్‌ పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా, చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా.. ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ రోజు నేను మాట్లాడే మాటలు.. ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి నేరుగా వినబడతాయి. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి.. శత్రువులకు తగిన జవాబిస్తాయి అని మోదీ పాక్‌ను హెచ్చరించారు. కార్గిల్‌ యుద్దానికి లద్దాఖ్‌ సాక్షిగా నిలుస్తుంది. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్‌ దివస్‌ జరుపుకుంటున్నాం. మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శనం. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కింది. దేశం కోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది. లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్‌ అధిగమిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద కలల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నిలయంగా ఉంది. ఈ భూలోక స్వర్గం శాంతి, సౌభ్రాతృత్వం వైపు వేగంగా పరిగెడుతోందని మోదీ తెలిపారు. అంతకుముందు, యుద్ధ స్మారకం వద్ద కార్గిల్‌ అమరవీరులకు ప్రధాని నివాళులర్పించారు. వీర జవాన్ల కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షింకున్‌ లా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణపనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. టన్నెల్‌ నిర్మాణ ప్రాంతం వద్ద వర్చువల్‌గా తొలి బ్లాస్ట్‌ చేశారు. 4.1 కిలోవిూటర్ల పొడవైన ఈ ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాలను వేగంగా తరలించేందుకు, సైనిక సామగ్రిని చేరవేసేందుకు ఈ సొరంగం సమర్థంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగంగా గుర్తింపు సాధించనుంది.పొరుగు దేశం పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. 25వ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ద్రాస్‌ సెక్టార్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్‌ నేరాలకు పాల్పడి గతంలో విఫలం అయ్యిందని, కానీ ఆ చరిత్ర నుంచి ఆ దేశం ఏవిూ నేర్చుకోలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ప్రచ్ఛన్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోందని విమర్శించారు. తాను మాట్లాడే ప్రదేశం నుంచి ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముఠా నేతలు తన స్వరాన్ని నేరుగా వింటారని, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న దేశాలకు ఓ విషయాన్ని చెప్పదలుచుకున్నానని, ఆ దేశ కుంచిత ఆలోచనలు ఎన్నటికీ విజయవంతం కావు అని ప్రధాని తెలిపారు. పూర్తి స్థాయి దళాలతో ఉగ్రవాదుల్ని మా సైనికులు అణిచివేస్తారని, శత్రువుకు బలమైన సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లడాఖ్‌ అయినా, జమ్మూకశ్మీర్‌ అయినా, అభివృద్ధికి అడ్డు వచ్చే ఎటువంటి సవాల్‌ను 

అయినా ఇండియా ఓడిస్తుందని మోదీ అన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీ నాటికి అయిదేళ్లు అవుతుందని, జమ్మూకశ్మీర్‌ ప్రజలు కొత్త భవిష్యత్తు, కొత్త కలల గురించి మాట్లాడుకుం టున్నారని తెలిపారు. మౌళిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక రంగం.. లడాఖ్‌, జేకేలో వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. కశ్మీర్‌లో కొన్ని దశాబ్దాల తర్వాత సినిమా హాల్‌ను ఓపెన్‌ చేసినట్లు చెప్పారు. 35 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తాజియా ఊరేగింపు జరిగిందన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి