వేంగంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు

రూట్‌ మ్యాప్‌ తయారు చేశామన్న ఉత్తమ్‌ 

నీటిపారుదల అధికారులతో సుదీర్ఘ సవిూక్ష

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి నీటిపారుదల శాఖ రూట్‌ మ్యాప్‌ తయారు చేశామని ఆ శాఖ మంత్రి యన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా ఇచ్చిన హావిూ మేరకు 2025 డిసెంబర్‌ నాటికి ఆ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన వెల్లడిరచారు. పాలమూరు, రంగారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల పురోగతితోపాటు నిర్మించాల్సిన ప్రాజెక్టులపై జలసౌధలో నీటిపారుదల అధికారులతో ఆయన సుదీర్ఘ సవిూక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖా కార్యదర్శి రాహుల్‌ బొజ్జతోపాటు పలువురు అధికారులు సవిూక్షలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విూడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా బేసిన్‌ పరిధిలోని పాలమూరు`, రంగారెడ్డి ప్రాజెక్ట్‌ తో పాటు మహబూబ్నగర్‌ జిల్లాలోని కోయిల్‌ సాగర్‌, ఆర్‌ బి ఎల్‌ ఐ యస్‌, జే. ఎన్‌.ఎల్‌.ఐ .యస్‌,డిరడి ఎల్‌ ఐ యస్‌,ఏ.యం.ఆర్‌ యస్‌ ఎల్‌ బి సి, నెª`టటెంపాడు, భీమా, కల్వకుర్తి ఎల్‌ ఐ సి పాజెక్టులు. గోదావరి బేసిన్‌ పరిధిలోని చిన్న కాళేశ్వరం, నిల్వాయి ప్రాజెక్ట్‌, పాలెం వాగు, మత్తడి వాగు, యస్‌.ఆర్‌ యస్‌.పి ఫెస్‌2, చనాకా కోరాట, లోయర్‌ పెన్‌ గంగా, దేవాదుల, మోదీ కుంటవాగు, యస్‌.వై.పి, జే సి ఆర్‌ డి ఎల్‌ ఐ యస్‌, సీతారామ ఎల్‌ ఐ యస్‌ లపై సమగ్రమైన సవిూక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ప్రాజెక్ట్‌ లతో పాటు గోదావరి బేసిన్‌ పరిధిలోని చిన్న కాళేశ్వరం, మోదీకుంట,లోయర్‌ పెన్‌ గంగా, చనాక కోరాట, శ్రీపాద ఎల్లంపల్లి, జే సి ఆర్‌ డి ఎల్‌ యస్‌ తదితరాలు పూర్తి చేసేందుకు రూ.8వేల కోట్ల పై చిలుకు అవుతుందన్న అంచనాకు అధికారులు వచ్చారన్నారు. అయితే అదే సమయంలో 2025 డిసెంబర్‌ నెలాఖరికి పూర్తి చేయాలన్న నిర్దేశిత లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకున్న తాము నీటి పారుదల శాఖకు అదనంగా మరో 11 వేల కోట్ల బ్జడెట్‌ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో ఆర్థిక శాఖాకు పంపాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ లో రూ.28,000 కోట్లు నీటి పారుదల శాఖాకు కేటాయించగా అందులో గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌ ల నిర్మాణాల పేరుతో చేసిన అప్పులకు కడుతున్న వడ్డియే రూ.18,000 కోట్లు అని మరో రెండు వేల కోట్లు జీత భత్యాలకే ఖర్చు అవుతున్నాయని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. అందుకే అదనపు బడ్జెట్‌ ను సవిూకరించుకుని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరు లక్షల పై చిలుకు ఎకరాలు సేద్యంలోకి తేవాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ప్రాధాన్యత క్రమంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను ఏ,బి,సి కేటగిరీలుగా విభజించామన్నారు. ఇప్పటికే పూర్తి కావొచ్చిన వాటిని ఏ కేటగిరీలో, ఆ తరువాత బి, ఆ తరువాత సి లుగా విభజించడం జరిగిందన్నారు.

ఏ కేటగిరీలో 240.66 కోట్లతో 47,882 ఏకరాల ఆయకట్టును సేద్యం లోకి తీసుకొస్తన్నట్లు ఆయన ప్రకటించారు. అదే విదంగా ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులుగా నిర్మితమౌతున్న ప్రాజెక్టులకు సుమారు 7,500 కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో 5,84,770 ఎకరాల ఆయకట్టు భూమిని సేద్యం లోకి తీసుక రానున్నట్లు ఆయన చెప్పారు. అదే విదంగా నిర్మల్‌ జిల్లా సదర మాట్‌ ప్రాజెక్టు ను ఈ నేల చివరి నాటికి,ఖమ్మం జిల్లాలో సీతారాం ప్రాజెక్ట్‌ ను ఆగస్టు 15 న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం