
న్యూట్రిషనిస్ట్ సూచించిన 3 సింపుల్ లైఫ్ స్టైల్ సీక్రెట్స్!
నేటి ఆధునిక జీవనశైలిలో మధుమేహం (డయాబెటిస్) ప్రతి ఇంట్లోనూ కనిపించే సమస్యగా మారింది. అనియమిత ఆహారం, శారీరక చురుకుతనం లేకపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాలే దీనికి ప్రధాన మూలాలు. అయితే సరైన జీవనశైలి మార్పులు చేస్తే డయాబెటిస్‌ను నియంత్రించడమే కాకుండా, కొందరిలో మందులు లేకుండానే సాధారణ స్థాయికి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ హర్షిత కౌశిక్ తన అనుభవం ద్వారా వెల్లడించారు. 12 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్న 42 ఏళ్ల వ్యక్తి, కేవలం మూడు కీలక మార్పులతో మందులు అవసరం లేకుండా ఆరోగ్యంగా మారాడని ఆమె తెలిపారు. ఆ మార్పులు ఏమిటంటే…
1. రాత్రి భోజనంలో కీలక మార్పు
డయాబెటిస్ ఉన్నవారు డిన్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి భోజనం ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండేలా ప్లాన్ చేయాలని న్యూట్రిషనిస్ట్ సూచిస్తున్నారు.
సోయాబీన్ సలాడ్, నల్ల శనగలు, మొలకెత్తిన గింజల సలాడ్ వంటి ఆహారాలు చక్కగా పనిచేస్తాయి. రాత్రి వేళ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం, రోటీలు వంటి వాటిని తగ్గించడమే మంచిది.
2. భోజన సమయ నియమం + చిన్న నడక
రాత్రి భోజనాన్ని ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల లోపే పూర్తి చేయడం చాలా ముఖ్యం. భోజనం చేసిన వెంటనే కూర్చోకుండా, 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
ఈ చిన్న మార్పు బ్లడ్ షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
3. ఆయుర్వేద మూలిక ‘గుడ్‌మార్’ వినియోగం
డయాబెటిస్ నియంత్రణలో ఆయుర్వేదం కూడా మంచి సహాయమే. పడుకునే ముందు 30 నిమిషాలకే ‘గుడ్‌మార్’ (తెలుగులో పొడపత్రి)తో తయారుచేసిన టీ తీసుకోవడం ఆ వ్యక్తికి మంచి ఫలితాలు ఇచ్చిందని డాక్టర్ హర్షిత తెలిపారు.
ఈ మూలికను ఆయుర్వేదంలో ‘షుగర్ నాశిని’గా పిలుస్తారు. ఇది షుగర్ స్పైక్స్ తగ్గించడమే కాకుండా, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగా ప్రోత్సహిస్తుంది.