పిఠాపురం లోకదాలత్‌లో 111 కేసులు పరిష్కారం

పిఠాపురం, జూన్‌ 29 : జాతీయ లోకదాలత్‌ పిలుపుమేరకు పిఠాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం కోర్టుల ఆవరణలో 12వ అదనపు జిల్లా జడ్జి ఏ.వాసంతి పర్యవేక్షణలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు, న్యాయమూర్తులు లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ లోక్‌అదాలత్‌ నందు రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన బాధితురాలికి రూ.50లక్షల రూపాయలు నష్టపరిహారం ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా అందజేశారు. సివిల్‌, క్రిమినల్‌, మోటార్‌ వెహికల్‌, మెయింటినెన్స్‌, డివిసి కేసులు పరిష్కారం అయ్యాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా కోర్టు పరిధిలో భార్యాభర్తలు వేసుకున్న విడాకుల కేసులు నలుగురు పరిష్కారం దిశగా ఆలోచన చేసి, వారు కలుసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎం.బాబు, జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎం.విజయ రామేశ్వరి, న్యాయవాదులు కె.వీరభద్రరావు, ఇన్సూరెన్స్‌ సంస్థ స్టాండిరగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది ఎస్‌.వి.రాధాకృష్ణ, వై.వి.యన్‌.మూర్తి, డి.రమేష్‌ బాబు, కొంజర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం
IMG-20260630-WA0019
తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
IMG_20260626_215013
భారత్‌కు ఐర్లాండ్ షాక్.. చారిత్రాత్మక విజయంతో సిరీస్‌లో సంచలనం
InShot_20260626_073317547
పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి
IMG_20260626_064342
హోర్ముజ్ జలసంధి రాకపోకలకు తాత్కాలిక విరామం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి