విళ్లివాకం న్యూస్: చెన్నైలో వైఎస్ఆర్సిపి సేవాదళ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వ్యాసర్పాడి డాన్ బాస్కో పాఠశాలలో మధ్యాహ్నం పిల్లలకు కేక్, చాక్లెట్, బిరియాని, క్రిస్మస్ డ్రెస్ అందజేసి కోలాహలంగా జరుపుకున్నారు. ఇందులో వైఎస్ఆర్సిపి సేవాదళ్ అభిమానులందరూ పాల్గొన్నారు. సాయంత్రం 4:00 గంటల సమయంలో ఆవడి వేల్ టెక్ కళాశాలలో స్టూడెంట్స్ కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి కోలాహలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
వైఎస్ఆర్సిపి సేవాదళ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో శరత్ కుమార్ రెడ్డి, సూర్య రెడ్డి, భాను, కృత్తిక, సంపత్ కుమార్, ఉమ, నవీన్, వెల్ టెక్ కళాశాల విద్యార్థులు నరేష్, శంకర్, భరత్, గౌతమ్, వెంకీ, ముని, సూరి తదితరులు పాల్గొన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com